AP: కాకినాడ పోర్టులో మళ్లీ రేషన్ బియ్యం కలకలం రేపాయి. ఇవాళ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు పోర్టుకు వెళ్లి కంటైనర్లను పరిశీలించగా బియ్యం బస్తాలు కనిపించాయి. సుమారు 142 కంటైనర్లలో బియ్యం ఎగుమతికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వాటి నమూనాలు సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్‌కి పంపించారు. ఇటీవల స్టెల్లా షిప్‌లో రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.