జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. నిన్న రాత్రినే హైదరాబాద్‌కు చేరుకున్న పవన్.. ఆదివారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి సంఘీభావం చెబుతారని బన్నీ, మెగా అభిమానులు భావించారు. కానీ పవన్ మాత్రం అల్లు అర్జున్‌ను కలవకుండానే తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.