జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చిన బన్నీని చూసి ఆయన సతీమణి స్నేహారెడ్డి కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. దీనిపై నటి సమంత తాజాగా స్పందించారు. ఆ వీడియోను షేర్ చేసిన సమంత.. తాను ఎమోషనల్ అయ్యానని పరోక్షంగా తెలియజేస్తూ.. ‘ఇప్పుడు నేనేమీ ఏడవడం లేదు ఓకే’ అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎమోజీలు షేర్ చేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిని ట్యాగ్ చేసి వారిద్దరిని చూస్తుంటే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.