సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల ఆసరా పెన్షన్ రూ. 6 వెలు ఇవ్వాలని, దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు కాశప్ప డిమాండ్ చేశారు.