నారాయణపేట మండలం లింగంపల్లి వద్ద అగ్ని ప్రమాదం జరిగిన భాగ్యలక్ష్మి కాటన్ మిల్లును గురువారం సాయంత్రం మాజీ డిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ శివకుమార్ రెడ్డి పరిశిలించిలించారు. ఆస్తి నష్టం, ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను యజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా ఎమ్మెల్యే తో మాట్లాడుతానని చెప్పారు. అనంతరం కొల్లంపల్లి దర్గాలో ఉర్సు సందర్భంగా ప్రార్థనలు చేశారు.