నారాయణపేట పట్టణంలో ఎస్సీ బాలికలు, బాలుర వసతి గృహాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు, విద్యార్థులకు అందించేందుకు సిద్ధం చేసిన అల్పాహారం పరిశీలించారు. చలికాలం కావడంతో విద్యార్థులకు ఇచ్చిన దుప్పట్లు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు.