ఊట్కూర్: విద్యార్థిని అదృశ్యం

74చూసినవారు
ఊట్కూర్: విద్యార్థిని అదృశ్యం
ఊట్కూర్ మండల పరిధిలో గురువారం డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణం రాజు వివరాల ప్రకారం.. మాగనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఊట్కూర్ మండలంలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ నారాయణపేటలోని ఓ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చదవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 13న కాలేజీకి అని వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. ఈ మేరకు ఆమె మేనమామ ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్