నారాయణపేట పట్టణంలోని కేజిబివి, గురుకుల పాఠశాలను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో వున్న ఆహార ధాన్యాలను, కూరగాయలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. టీచర్ల కొరత ఉందని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.