ఈనెల 21 నుండి 23 వరకు సిరిసిల్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజిలో జరిగే 10వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల విద్యార్థులు ఎంపికైనట్లు కొచ్ రామ్మోహన్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న లోకేష్, ప్రవీణ్, విష్ణు ఎంపికయ్యారని.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరపున సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రిన్సిపల్ రాజారాం అభినందించారు.