తాడిపర్తిలో ఘనంగా పీర్ల పండుగ

58చూసినవారు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తిలో ఘనంగా పీర్ల పండుగ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి పీర్ల చావిడి ఎదుట గ్రామ యువకులు ఉత్సాహంగా పాటలు పాడుతూ అలై ఆడారు. మరో పక్క మహిళలు పాటలు పాడుతూ బొడ్డేమలు వేశారు. మొక్కుబడి ఉన్నవారు మొక్కుబడి చెల్లించుకున్నారు. అర్ధరాత్రి వరకు యువకుల అలై, మహిళల బొడ్డెమ్మ కార్యక్రమాలు వేయడం వంటి కార్యక్రమాలు కోనసాగాయి. కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్