వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు సమయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ కు వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని జిల్లాకి, తెలంగాణ పోలీస్ శాఖకి మంచి పేరు తీసుకురావాలన్నారు.