వనపర్తి జిల్లా వైద్య విధాన పరిషత్ (డిసిహెచ్ఎస్) డాక్టర్ చైతన్య కుమార్ గౌడుకు ఏఐటీయూసీ నేతలు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 5 నెలలుగా ఇవ్వలేదని, ఈ నెల 19 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్తారని చెప్పారు. సురేశ్ మాట్లాడుతూ. 7 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 19 లోగా జీతాలు ఇవ్వాలన్నారు. కుతుబ్ తదితరులు పాల్గొన్నారు.