వనపర్తి: రవాణా రంగకార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి

53చూసినవారు
వనపర్తి జిల్లా కార్యాలయంలో ట్రాలీ వర్కర్స్ తో మంగళవారం సిఐటియు విస్తృత స్థాయి సమావేశం ఎం. మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మోటారు వెహికల్ యాక్ట్ రద్దు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :