ప్రపంచ ఆకలి సూచీలో గతేడాది భారత్ 111 స్థానంలో ఉంది. 2024లో 27.3 స్కోరుతో భారత్ 105వ స్థానంలో ఉంది. భారత్ జనాభాలో 13.7 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35.5 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువగా ఉన్నారని, 18.7 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరని ఈ నివేదిక వెల్లడించింది. చిన్నారుల్లో 2.9 శాతం మంది తమ ఐదో జన్మదిన వేడుకను చూసుకోకుండానే కన్నుమూస్తున్నారని ఆక్షేపించింది.