వనపర్తి: కారు, బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

79చూసినవారు
ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. కొత్తకోటకు చెందిన వ్యక్తి బైకుపై వనపర్తి నుండి కొత్తకోట వైపు వెళ్తుండగా అదే సమయంలో వనపర్తికి వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. రాజపేట గ్రామంలో సమీపంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్