స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణంలోని ఇందిరాపార్కులో గల ఇందిరమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. భారత ప్రధానిగా సేవలందించిన ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్ గాంధీ గారు సైతం దేశం కోసం ప్రాణాలర్పించారని, వారి వర్ధంతిని జరుపుకోవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.