వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశం గురువారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఈ నెల 30న మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 10లక్షల ఆరోగ్య భీమా, ఉచిత బస్సు, ఉచిత కరెంటు 500కి సిలిండర్ 2లక్షల రుణమాఫీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.