ఎడ్ల బండిపై ఎక్కిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

83చూసినవారు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎడ్లబండ్ల ప్రదక్షిణను మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయాన ఎడ్ల బండిపై ఎక్కి ఎద్దుల బండిని తోలుతూ రామలక్ష్మణుల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజల అధికసంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్