
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్!
AP: రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ రూటే సపరేటు. వైసీపీ నేతగా ఉన్న ఆయన రోజుకో వివాదంలో చిక్కుకుంటూ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉంటున్నారు. కుటుంబ వివాదంలో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్నారు. తాజాగా ఆయన తీసుకున్న డాక్టరేట్ పెద్ద దుమారమే రేపుతోంది. ఊరు, పేరు లేని యూనివర్సిటీ అని, యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. దీనిపై దువ్వాడ ఎలా స్పందిస్తారో వేేచి చూడాలి.