విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం 'వీడీ12'. ఇటీవల ఈ మూవీ నుంచి లీకైన దృశ్యాలపై తాజాగా నిర్మాణ సంస్థ సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పందించింది. 'డియర్ రౌడీ ఫ్యాన్స్.. మీకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు టీమ్ ఎంతో కష్టపడుతోంది. 60% షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. లీకైన ఫొటోను షేర్ చేయొద్దు' అని సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు పెట్టింది.