Top 10 viral news 🔥
రీల్స్ పిచ్చి.. డ్యాన్స్ చేస్తూ కిందపడ్డ మహిళ (వీడియో)
ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫేమ్ అవ్వడం కోసం రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీల్స్ చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఓ మహిళ చెరువు గట్టుపై ఉన్న మట్టిపెళ్లపై నిల్చొని రీల్ చేసింది. ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి.. దొర్లుకుంటూ చెరువులోని నీటి దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.