రెజ్లింగ్‌కు వీడ్కోలు చెప్పి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫోగట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత ఒలింపిక్ సంఘంతోపాటు అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం చేసిన కారణంగానే కాస్‌లో తీర్పు అనుకూలంగా రాలేదని వ్యాఖ్యానించారు. పీటీ ఉష కేవలం సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చి తనతో ఫోటోలు దిగారని.. కనీసం తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని వినేశ్ విమర్శించారు.