బెల్లంపల్లి పట్టణంలోని రెండో వార్డుకు చెందిన వివిధ పార్టీల పలువురు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అతి తక్కువ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు.