కన్నేపల్లి: విద్యుదాఘాతంతో ఒకరికి గాయాలు
కన్నెపల్లి మండలం బొత్తపల్లి గ్రామానికి చెందిన లట్కూరి రవి విద్యుదాఘాతంతో తీవ్ర గాయాల పాలయ్యారు. శుక్రవారం పొలంలో ట్రాక్టర్ తో జంబు కొడుతుండగా విద్యుత్ వైర్లు కర్లసాయంతో ఉండగా, ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా విద్యుత్ తగిలి రవిపై పడ్డాయి. విద్యుత్ షాక్ తో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. మంచిర్యాల దవాఖానకు అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం రవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.