కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయాలి

169చూసినవారు
కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయాలి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి, సండ్రోన్ పల్లి ,చిర్రకుంట, వెంకటాపూర్, మామిడి గట్టు ప్రధాన రహదారులపై శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన కల్వర్టులను శుక్రవారం మండల బీజేపీ అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ప్రధాన రహదారి ఆదిల్ పేట్-తుర్కపల్లి మధ్యలో ఉన్న కల్వర్టు పెద్ద రంధ్రం పడి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. నిత్యం ఈ మార్గం గుండా వెళ్ళే వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కల్వర్టు మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు డివి దీక్షితులు, మండల ప్రధాన కార్యదర్శి బంజర వంజరి వెంకటేష్, కార్యదర్శి పళ్ళ పవన్ కుమార్, మండల యువత ఉపాధ్యక్షులు ధైనేని రమేష్, పట్టణ యువమోర్చా ఉపాధ్యక్షులు జంగం మధు, రఘు, మహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్