ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు

52చూసినవారు
మంచిర్యాల పట్టణంలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వ్యాపారులు బాధ్యత తీసుకోవాలన్నారు.