TG: సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి సోదరి రాధ మండిపడ్డారు. మారు గంగారెడ్డి కుటుంబాన్ని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ముందు గంగారెడ్డి సోదరి రాధ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 'మా తమ్ముడి ప్రాణం తీసేదాక ఏ పోలీసు పట్టించుకోలేదు. అసలు మేము చెయ్యవట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం' అంటూ తీవ్రంగా స్పందించారు.