ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భారీ
భూకంపం సంభవించింది. శనివారం సంభవించిన ఈ
భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని 77 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ప్రస్తుతం ఈ శక్తివంతమైన
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదమేమీ లేదని, కానీ మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైనట్లు తెలిపింది.