మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్ జిల్లా రెసిడెన్సీ కోఠి సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్స్ వెనుక ఉన్న పొలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.