AP: మండపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. ఓ మహిళా బ్యాగులో నుంచి రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణలను ఎవరో దొంగిలించారు. తన బ్యాగులోని బంగారం కనిపించలేదని మహిళ చెప్పడంతో డ్రైవర్ బస్సును అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్కు తరలించాడు. దీంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు ఉదయం నుంచి పోలీస్స్టేషన్లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.