
రైతులకు సహాయక కేంద్రాల ఏర్పాటు: మంత్రి నాదెండ్ల
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు గుడ్న్యూస్ చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. రబీలో 13 లక్షలు 50 వేల మెట్రిక్ టన్నులు పంట వస్తుందని అంచనా వేశామన్నారు. 'సివిల్ సప్లై నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2900 రైతు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 12 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని' స్పష్టం చేశారు