మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రిక్టర్ స్కెల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. వరుస భూకంపాలు మయన్మార్‌ను కుదిపేస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మృతుల సంఖ్య 3,643కి చేరుకుంది. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది