TG: వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లు వక్ఫ్ బిల్లుకు మద్దతూబిల్లుకు మద్దతు తెలపాలని తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.