AP: ప్రభుత్వం పేదలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3220 కోట్ల అదనపు సహాయాన్ని కేటాయించింది. 'మారిన ఖర్చుకు అనుగుణంగా ఎస్సీలకు రూ.50,000, బీసీలకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందజేస్తున్నాం' అని గృహ నిర్మాణ సంస్థ ఎండీ రాజబాబు ఓ ప్రకటనలో తెలిపారు.