ఇండోనేషియాలోని ఓ బీచ్‌లో ఈత కొడుతున్న వ్యక్తిని మార్చి 29న మొసలి పొట్టనబెట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈత కొడుతూ ఉండగా, అతనిపై మొసలి దాడి చేస్తున్నట్లు చూసిన స్థానికులు భయంతో గట్టిగా కేకలు వేయారు. కానీ, ఆలోపే మొసలి అతడిని గబుక్కున పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.