కాంగ్రెస్ లోకి వలసల పరంపర

21817చూసినవారు
కాంగ్రెస్ లోకి వలసల పరంపర
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో మాజీ సర్పంచ్ బి రాములు, వార్డు మెంబర్లు ఖలీల్, ఇందూరి కృష్ణ తోపాటు 50 మంది పార్టీలో చేరారు. వీరందరికీ ఎంపీ అభ్యర్థి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సాధారంగా ఆహ్వానించారు. బూత్ లెవల్ అధ్యక్షుడు ప్రభు, గుల్ల వీరయ్య, బిక్షం, కోనేటి మానయ్య, ఇందూరి బాబు, గొల్ల కృష్ణ, గౌండ్ల బేబమ్మ, శ్రీశైలం గౌడ్, మైనార్టీ నాయకులు సయ్యద్ మునీర్, బాబర్, గౌసుద్దీన్, అక్బర్, పాష,, రజాక్, సోఫీ, ఇంతియాజ్, మబ్బుల్, మహబూబి, ఖాజా పాష, మహమూద్, యాదుల్ తదితరులు పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు,పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చేరిన వారు తెలిపారు.

ట్యాగ్స్ :