నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయని తూప్రాన్ మండలం మల్కాపూర్ సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన చింతల లలిత రమేష్ దంపతుల కు ప్రభుత్వం నుండి మంజూరైన ఒక లక్ష 116 ల చెక్కును వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలలో జరిగే పెండ్లిలకు ఆర్థిక సహాయం అందిస్తున్న BRS ప్రభుత్వాన్నికి ఎల్లప్పుడు ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.