సిద్దిపేట: కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. గర్భిణికి తీవ్ర గాయాలు
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. సిద్దిపేట - ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు 108కు సమాచారం అందించి క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.