Nov 10, 2024, 10:11 IST/జహీరాబాద్ నియోజకవర్గం
జహీరాబాద్ నియోజకవర్గం
జహీరాబాద్: కంటైనర్ లో చెలరేగిన మంటలు.. కార్లు దగ్ధం
Nov 10, 2024, 10:11 IST
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి పై కంటైనర్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఆదివారం రంజోల్ గ్రామ శివారులో బైపాస్ రోడ్డులో కార్ల లోడుతో ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ కు ప్రమాద వశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 8 కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పెందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. రహదారి పై ఒక్క సారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది.