AP: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన కేవీపల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి రెడ్డి మోక్షిత్ ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ అయితే తన బిడ్డది ఉరి వేసుకునే వయసు కాదని, ఇంత మంది టీచర్లు ఉండి కూడా ఓ పిల్లాడిని చూడలేకపోయారంటూ మోక్షిత్ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఉరి వేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.