కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని కేటీఆర్ మండిపడ్డారు. దళితబంధు, బీసీ బంధుతో పాటు రైతుబంధుకు కాంగ్రెస్ కూడా రాంరాం ప్రకటించింది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని మంత్రి పొంగులేటి అంటున్నారు. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. UPA హయాంలో కనీసం OBC మంత్రిత్వ శాఖ కూడా పెట్టలేదు. రాష్ట్రాల్లో బీసీల మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు.. కేంద్రంలో ఎందుకు లేదని ఆనాడే కేసీఆర్ నిలదీశారు. బీసీల ఓట్ల కోసమే కులగణన డ్రామా' అని ఫైర్ అయ్యారు.