మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో మంగళవారం విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. సాయంత్రం పాలపిట్టను చూసిన అనంతరం స్థానిక కచేరి వద్ద భగవద్వజ ఆవిష్కరణ ఆయుధ పూజ చేసి, ఆయుధాలతో షమీ వృక్షంతో స్థానిక అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్దకు వెళ్లి, అక్కడ పూజలు నిర్వహించి, అలైబలై కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.