టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (సోసైటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సంఘం సభ్యులు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రలాలలో మాత్రమే ధన్యాన్ని అమ్ముకోవాలని రైతులను సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సోసైటీ డైరెక్టర్ లు, పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.