రుయా ఆస్పత్రిలో కిలేడీ.. డాక్టర్ వేషంలో దొంగతనం
AP: తిరుపతి రుయా ఆస్పత్రిలో దొంగ డాక్టర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ వేషంలో తిరుగుతూ ఆస్పత్రికి వచ్చే రోగుల నుంచి అందినకాడికి దోచుకునేది. రుయా ఆస్పత్రిలో అనస్తీషియా టెక్నీషియన్ అంటూ వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి చెప్పుకుని తిరిగేది. పేషంట్లతో పరిచయాలు పెంచుకుని వారి నుంచి డబ్బులు కాజేసేది. దొంగతనానికి పాల్పడుతుండగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. దాంతో ఆమెను పోలీసులకు అప్పగించారు.