ఏపీలో సంక్రాంతికి ఏరులై పారిన మద్యం

77చూసినవారు
ఏపీలో సంక్రాంతికి ఏరులై పారిన మద్యం
ఏపీలో సంక్రాంతికి మద్యం ఏరులై పారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో రోజుకు రూ.150 కోట్ల చొప్పున మద్యం అమ్మినట్లు అంచనా. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు రూ.80 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ పండగ మూడు రోజుల్లో అదనంగా రూ.160 కోట్లు అమ్ముడైంది. మద్యం లైసెన్సీలు భోగి రోజు రూ.210 కోట్లు, ముక్కనుమ రోజు రూ.220 కోట్ల మద్యాన్ని కొన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్