AP: మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎమ్మెల్యే విజయశ్రీ నివాసం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు చేపట్టామన్నారు.