యుపీకి చెందిన పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ యోగా సాధకులు స్వామి శివానంద వందేళ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యులు తెలిపారు. ఆధార్ ప్రకారం ఆయన వయసు 129 ఏళ్లు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 16లో ఏర్పాటు చేసిన ఆయన క్యాంపునకు భక్తులు క్యూ కట్టారు. ‘స్వామికి ఏ జబ్బూ లేదు. నూనె, ఉప్పు వంటివి లేకుండా ఉడికించిన ఆహారం మాత్రమే తింటారు. పాల పదార్థాలు కూడా ముట్టరు’ అని ఆయన భక్తుడు చెప్పాడు.