ప్రమాదానికి గురైన మహిళకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

79చూసినవారు
ప్రమాదానికి గురైన మహిళకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన పిట్ల కమలమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు కరెంటు షాక్ గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే వారి కుటుంబానికి 10 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వీటిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్కాని పవన్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు రామస్వామి, నాయకులు ముత్యాలు, రాజు గౌడ్, ముత్యాలు, ధుబ్బయ్య, శేఖర్, అక్బర్, దుర్గయ్య, తదితరులు వారికి అందజేశారు.