మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో మహాత్మా గాంధీ బ్లాక్ వద్ద 350వ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అమర్ సింగ్ పాల్గొన్నారు. మల్కాపూర్ గ్రామంలో నిరంతరాయంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకమని డాక్టర్ అమర్ సింగ్ అన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధులు రావన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నే మహాదేవి, నవీన్ యాదవ్, ఉప సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, మేకిన్ యువత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.