శివంపేట: ఇంట్లో గొడవపడి వెళ్ళాడు.. శవమై తేలాడు
విజయదశమి పండగ రోజు ఇంట్లో గొడవపడి వెళ్లిన వ్యక్తి చెరువులో సోమవారం శవమై తేలాడు. శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన మల్లికార్జున్ పండగ రోజు ఇంట్లో గొడవపడి బయటికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదు. గ్రామ శివారులోని చెరువులో శవం కనిపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.